News April 3, 2025

JEE అడ్మిట్ కార్డులు విడుదల

image

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(JEE) మెయిన్ సెకండ్ సెషన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఈనెల 7,8,9 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో NTA ఎగ్జామ్స్ నిర్వహించనుంది.

Similar News

News January 12, 2026

అగ్నివీర్ వాయు దరఖాస్తులు షురూ

image

ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు నియామకాలకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్లపాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించేందుకు యువతకు అవకాశం దక్కనుంది. ఫిబ్రవరి 1వ తేదీ 11PM వరకు అప్లై చేసుకునేందుకు గడువుంది. 2006 జనవరి 1-2009 జులై 1 మధ్య పుట్టిన, ఇంటర్/12వ తరగతిలో 50% మార్కులు సాధించిన అవివాహితులు అర్హులు. మరిన్ని వివరాలకు iafrecruitment.edcil.co.in.లో సంప్రదించవచ్చు.

News January 12, 2026

చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు

image

AP: జగన్‌ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో ₹3.32L కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు ఏడాదిన్నరలోనే ₹3.02L కోట్లు అప్పు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైసీపీ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్‌ అవుతుందా? జగన్‌ చేసిన అప్పుల్లో 90% CBN ఏడాదిన్నరలోనే చేశారు. ఎన్నికల హామీలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు’ అని అంబటి ఫైరయ్యారు.

News January 12, 2026

Q3 ఫలితాలు ప్రకటించిన TCS.. భారీగా డివిడెండ్

image

టీసీఎస్ Q3 ఫలితాలను ప్రకటించింది. FY 2025-26 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.10,657 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో(Q3-రూ.12,380) పోలిస్తే 14% నికరలాభం తగ్గినట్లు తెలిపింది. అయితే ఆదాయంలో మాత్రం 5శాతం వృద్ధితో రూ.67,087 కోట్లకు చేరింది. 11,151 మంది ఉద్యోగులు తగ్గిపోగా ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేర్‌పై రూ.57 చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.