News April 22, 2024

25న జేఈఈ మెయిన్-2 ఫలితాలు

image

దేశవ్యాప్తంగా IIITలు, NITలలో ప్రవేశాలకు నిర్వహించిన JEE మెయిన్-2 ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది హాజరయ్యారు. jeemain.nta.ac.in లేదా ntaresults.nic.in వెబ్‌సైట్‌లో స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అర్హత సాధించిన 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఇస్తారు.

Similar News

News March 17, 2026

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం: రోజూ స్వీట్ పొటాటో తింటే?

image

తక్కువ రేటుకు లభించే స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్, విటమిన్-A, C, E, B6, పొటాషియం, పీచు తదితర పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ల నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ‘రోజూ చిలగడదుంప తింటే వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం, బీపీ, ఒత్తిడి తగ్గుతాయి. కంటి, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News March 17, 2026

మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

image

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.

News March 17, 2026

24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్

image

వినియోగదారులకు వేగవంతమైన డెలివరీని అందించడమే లక్ష్యంగా ఇండియా పోస్ట్ ‘24 స్పీడ్‌ పోస్ట్‌’, ‘48 స్పీడ్‌ పోస్ట్‌‌’ పేర్లతో కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. తొలిదశలో హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సదుపాయం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. వస్తువులు పోస్టు చేసిన మరుసటి రోజే డెలివరీ అవ్వకపోతే పేమెంట్ తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. OTPతో డెలివరీ తీసుకోవచ్చు.