News March 11, 2025
జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.
Similar News
News March 11, 2025
మణిపుర్లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జవాన్ల వీరమరణం

మణిపుర్లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో 13మంది గాయాలపాలయ్యారు. సేనాపతి జిల్లాలోని చాంగౌబంగ్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
News March 11, 2025
బీరువాలో కాగితాలు.. వాటి విలువ రూ.12 లక్షలు!

ఇంట్లోని పాత కాగితాలు అతనికి దాదాపు రూ.12 లక్షలు తెచ్చిపెట్టాయి. రతన్ అనే వ్యక్తికి తన తండ్రి 1992లో రిలయన్స్ ఇండస్ట్రీస్లో కొన్న షేర్స్ అగ్రిమెంట్ పేపర్స్ బీరువాలో లభించాయి. ఒక్క షేర్ రూ.10 చొప్పున 30 షేర్లు కొనుగోలు చేశారు. దీని గురించి రతన్ ట్వీట్ చేయడంతో ట్రేడ్ నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని బోనస్లు కలిపి ఇప్పుడవి 960 షేర్స్ అయ్యాయని, వీటి విలువ రూ.11.88 లక్షలని చెబుతున్నారు.
News March 11, 2025
పిల్లల ఆకలి తీర్చేందుకు..!

పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుందనే విషయాన్ని లండన్కు చెందిన మేరీ ఆన్ బెవన్ నిరూపించారు. నలుగురు పిల్లలున్న ఆమె 1914లో భర్త చనిపోవడంతో కుటుంబ పెద్దగా మారారు. వారి పోషణ కష్టమవగా ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అక్రోమెగలీ వ్యాధి కారణంగా ఆమె ముఖం అందవిహీనంగా మారడంతో ‘వరల్డ్ అగ్లీయెస్ట్ ఉమెన్’ పోటీలో పాల్గొన్నారు. గెలిచిన డబ్బుతో వారి ఆకలి తీర్చారు. ఆ తర్వాత సర్కస్లో చేరి వారి బాగోగులు చూసుకోగలిగారు.