News April 18, 2025

జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <>https://jeemain.nta.nic.in/<<>> వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కాగా రేపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. నిన్న రాత్రి ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో ఉంచి వెంటనే డిలీట్ చేసిన విషయం తెలిసిందే. కీలో తప్పులు దొర్లడంతో తొలగించినట్లు సమాచారం.

Similar News

News April 19, 2025

మామిడి పండ్లు తింటున్నారా?

image

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తుచ్చేది మామిడి పండ్లే. అయితే, కార్బైడ్‌‌తో మాగించిన పండ్లను తింటే అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15-20 నిమిషాలు ఉంచిన తర్వాత మంచినీటితో కడిగి, ఆపై తుడిచి తినాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తొక్కను తినకపోవడమే బెటర్ అని చెబుతున్నారు. కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిదంటున్నారు.

News April 19, 2025

2వేల మందిపై ఇవే చర్యలుంటాయా?: IAS స్మితా

image

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో AI ఎడిటెడ్ ఫొటోను రీట్వీట్ చేసినందుకు పోలీసులిచ్చిన <<16116901>>నోటీసులపై<<>> IAS స్మితా సబర్వాల్‌ స్పందించారు. ఇవాళ పోలీసులకు తన స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ఆమె ట్వీట్ చేశారు. ‘ఈ పోస్టును షేర్ చేసిన 2వేల మందిపై ఒకే విధమైన చర్యలుంటాయా? అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. అప్పుడు చట్టంముందు అందరూ సమానులే అన్న సూత్రం రాజీపడినట్లవుతుంది’ అని రాసుకొచ్చారు.

News April 19, 2025

ఆ బాధను అబ్బాయిలు భరించలేరు: జాన్వీ కపూర్

image

మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అబ్బాయిలు క్షణం కూడా భరించలేరని స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. కానీ కొంతమంది పురుషులు ఈ నొప్పిని చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలసరి సమయంలో మహిళలు మానసిక క్షోభ అనుభవిస్తారని చెప్పారు. అలాంటి సమయంలో వారు ఓదార్పు కోరుకుంటారని తెలిపారు. కాగా జాన్వీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ మూవీలో నటిస్తున్నారు.

error: Content is protected !!