News May 19, 2024

జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల

image

JEE మెయిన్ పేపర్-2కి సంబంధించి సెషన్-2 ఫలితాలను NTA విడుదల చేసింది. ఈ రిజల్ట్స్‌ను https://jeemain.nta.ac.in./ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్లానింగ్ పేపర్‌లో ఏపీకి చెందిన కొలసాని సాకేత్ ప్రణవ్, కర్ణాటకకు చెందిన అరుణ్ 100 ఎన్టీఏ స్కోర్ సాధించారు. ఆర్కిటెక్చర్‌ పేపర్‌లో ఝార్ఖండ్‌కు చెందిన సులగ్న బాసక్, తమిళనాడుకు చెందిన ఆర్.ముత్తు 100 ఎన్టీఏ స్కోర్ పొందారు.

Similar News

News November 14, 2025

ఏపీ ఉక్కురంగంలో జపాన్ పెట్టుబడులు: ఓనో కేయిచ్చి

image

AP: విశాఖ సీఐఐ పార్ట్‌నర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న జపాన్ రాయబారి ఓనో కేయిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచ్చి సీఎంకు వివరించారు. ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం కావాలని CM కోరారు. CII సమ్మిట్‌లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

News November 14, 2025

ఈ నెల 19న రైతుల ఖాతాల్లో PM కిసాన్ డబ్బులు

image

PM కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న PM మోదీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ <>పోర్టల్‌లో<<>> నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.

News November 14, 2025

35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలు.. వరుసగా 9వ సారి ఎన్నిక!

image

బిహార్‌లో సీనియర్ నేతలు ప్రేమ్ కుమార్(BJP), బిజేంద్ర ప్రసాద్ యాదవ్(JDU) అరుదైన ఘనత సాధించారు. వరుసగా 9వ సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1990 నుంచి వారు MLAలుగా కొనసాగుతుండటం గమనార్హం. తాజా ఎన్నికల్లో గయా టౌన్ నుంచి 26,423 ఓట్ల మెజారిటీతో ప్రేమ్ కుమార్ గెలవగా, సుపౌల్‌లో 16,448 ఓట్ల ఆధిక్యంతో బిజేంద్ర గెలుపొందారు. దాదాపు 35 ఏళ్లుగా ఇద్దరూ అవే నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.