News February 4, 2025

జేఈఈ(మెయిన్) ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల

image

జేఈఈ (మెయిన్) ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైంది. దీంతో పాటు రెస్పాన్స్ షీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి 6వ తేదీ వరకు వీటిపై NTA అభ్యంతరాలు స్వీకరిస్తుంది. జనవరి 22 నుంచి 29 వరకు జేఈఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ <>క్లిక్<<>> చేసి అధికారిక సైట్‌లోకి వెళ్లి ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Similar News

News February 4, 2025

పంచాయతీ ఎన్నికలు: రేపటి నుంచి ట్రైనింగ్

image

TG: పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు రేపటి నుంచి హైదరాబాద్‌లో శిక్షణ ప్రారంభమవనుంది. వీరి శిక్షణ ముగిసిన వెంటనే ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కాగా ఈ నెల 15లోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. ఈ నెల చివరి వారం లేదా మార్చి మొదటివారంలో ఎన్నికలు జరపాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

News February 4, 2025

‘అల వైకుంఠపురంలో’ తమిళ మూవీ అన్న పూజ.. నెటిజన్ల ఫైర్

image

అల్లు అర్జున్, తాను కలిసి నటించిన ‘అల వైకుంఠపురంలో’.. తమిళ సినిమా అని పూజా హెగ్డే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అది తమిళ సినిమా అయినా హిందీ ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారని ‘దేవా’ మూవీ ప్రమోషన్లలో పూజ కామెంట్స్ చేశారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేశారని, అంత పెద్ద హిట్ అయిన సినిమానే మర్చిపోతారా? అని ఫ్యాన్స్ పూజపై మండిపడుతున్నారు.

News February 4, 2025

మూడేళ్ల కిందటే మోనాలిసాకు ఫొటోషూట్

image

తేనెకళ్ల సుందరి మోనాలిసాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితమే ఆమె ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. 2022లో మహేశ్వర్ అహిళ్యాదేవికోటలో ‘పరికర్మ’ మూవీ షూట్ జరిగింది. ఇది చూసేందుకు మోనాలిసా రాగా ఫొటోగ్రాఫర్ సంజీత్ చౌదరి ఆమెను చూశారు. వెంటనే ఆమెను ఒప్పించి ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలను సంజీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్‌’లో నటిస్తున్నారు.

error: Content is protected !!