News February 23, 2025

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్ పేపర్-2 (BArch&B.Planning) ఫలితాలను NTA విడుదల చేసింది. <>https://jeemain.nta.ac.in/<<>> వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. జనవరిలో జరిగిన ఈ పరీక్షలకు 62,740 మంది హాజరయ్యారు. BArchలో మహారాష్ట్రకు చెందిన నీల్ సందేశ్, B.Planningలో మధ్యప్రదేశ్‌కు చెందిన సునిధి సింగ్ 100 పర్సంటైల్ సాధించారు.

Similar News

News February 23, 2025

‘భారత్ ఓడిపోతుంది’ అన్న ఐఐటీ బాబా ఎక్కడ?

image

పాక్ చేతిలో భారత్ ఓడిపోతుందని <<15548119>>జోస్యం చెప్పిన<<>> ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. Xలో #IITianBaba ట్రెండ్ అవుతోంది. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని నిన్న ఐఐటీ బాబా అనడంపై ఫైరవుతున్నారు. ‘ఇప్పుడు నీ జోస్యం ఏమైంది?’ అని నిలదీస్తున్నారు. వైరల్ అయ్యేందుకు సొంత దేశం ఓడిపోవాలని కోరుకోవడమేంటని మండిపడుతున్నారు.

News February 23, 2025

ఇది అత్యంత దారుణం: YS జగన్

image

AP: గ్రూప్‌-2 అభ్యర్థులకు న్యాయం చేస్తున్నట్టు నమ్మబలికి చివరకు నట్టేటా ముంచారని CM చంద్రబాబును YS జగన్ విమర్శించారు. ‘అభ్యర్థుల సమస్యలకు పరిష్కారం చూపిస్తానని పరీక్షకు 2 రోజులముందు విద్యాశాఖ మంత్రి మోసపూరిత ప్రకటన చేశారు. ప్రభుత్వం లేఖ ఇచ్చినా APPSC ముందుకు వెళ్తోందని CM వాయిస్‌తో ఆడియో లీక్‌ చేయించి డ్రామా చేశారు. అయోమయం, అస్పష్టత మధ్యే పరీక్షలు నిర్వహించడం అత్యంత దారుణం’ అని <>ట్వీట్<<>> చేశారు.

News February 23, 2025

అసెంబ్లీలో వైసీపీ భాష వాడొద్దు: పవన్

image

AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దామన్నారు. ప్రజాగొంతును అసెంబ్లీలో వినిపిద్దామని, సభ్యులు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని సూచించారు. వాడే భాష హుందాగా ఉండాలని, వైసీపీ భాష వాడవద్దని హితవు పలికారు.

error: Content is protected !!