News April 19, 2025

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్(సెషన్-2) ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ రిలీజ్ చేసిన NTA అధికారులు తాజాగా విద్యార్థుల పర్సంటైల్ స్కోరులో ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్స్ కోసం విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్లో ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. దేశ వ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలో 24 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, అందులో తెలుగువారు నలుగురు ఉన్నారు.

Similar News

News April 19, 2025

ఒకే రోజు ఓటీటీ, టీవీల్లోకి కొత్త సినిమా?

image

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ ZEE5లో మే 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజున జీ తెలుగు ఛానల్లోనూ రానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. వార్నర్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఒకే రోజున OTT, టీవీల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

News April 19, 2025

ఔరంగజేబు క్రూరుడని నెహ్రూయే అన్నారు: రాజ్‌నాథ్ సింగ్

image

మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ వంటివాళ్లు దేశానికి ఆదర్శం కానీ ఔరంగజేబులాంటివారు కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘శౌర్యానికి, దేశభక్తికి మహారాణా ప్రతాప్ ఓ ప్రతీక. ఆయన్నుంచి స్ఫూర్తి పొంది శివాజీ మొఘలులపై పోరాడారు. ఔరంగజేబు పరమ క్రూరుడని నెహ్రూయే స్వయంగా అన్నారన్న విషయం అందరూ తెలుసుకోవాలి. రాణా, శివాజీ ఇద్దరూ మొఘలులకు మాత్రమే వ్యతిరేకం. ముస్లింలకు కాదు’ అని పేర్కొన్నారు.

News April 19, 2025

ట్రంప్ వద్దంటున్నా.. ఇరాన్‌పై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు

image

ఇరాన్‌పై దాడి వద్దని ఓవైపు అమెరికా వారిస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే నెలల్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇరాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఉండొద్దనేదే తమ లక్ష్యమని వివరించారు. అటు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ను దాడి చేయొద్దని వారిస్తున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!