News June 25, 2024
ఎమ్మెల్యే సత్యంను పరామర్శించిన జీవన్ రెడ్డి

TG: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ కొంపెల్లిలోని నివాసంలో ఆయనను కలిసి సానుభూతి తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
Similar News
News January 17, 2026
పురుషులకూ ఫ్రీ బస్సు: AIADMK

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు AIADMK తొలి విడత మ్యానిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.2వేలు, సిటీ బస్సుల్లో పురుషులకూ ఫ్రీ జర్నీ, ఇల్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ.25వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించింది.
News January 17, 2026
కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

AP: ఈ సంక్రాంతి సీజన్‌లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.
News January 17, 2026
162 పోస్టులకు NABARD నోటిఫికేషన్ విడుదల

<


