News September 27, 2024
సిట్ ఏర్పాటుపై జీవో విడుదల

AP: తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో సిట్ ఏర్పాటుపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సభ్యులుగా గోపీనాథ్ శెట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివ నారాయణస్వామి, సత్యనారాయణ, సూర్య నారాయణ, ఉమామహేశ్వర్‌ను నియమించింది. సిట్‌కు సహకరించాలని హోం శాఖ, దేవదాయ శాఖ, టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News December 16, 2025
మహిళలూ.. మీరూ షిఫ్టుల్లో పని చేస్తున్నారా?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలకు స్త్రీ పురుష భేదం లేదు. ఉన్నతస్థానాలకు చేరాలంటే అన్ని షిఫ్టుల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. మహిళలకు ఉద్యోగంతోపాటు ఇంట్లో పనులు, పిల్లల బాధ్యతలూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ సమన్వయం చేసుకోవడం ముఖ్యం. రోజులో ఏదోక సమయంలో కుటుంబసభ్యులతో గడిపేందుకు ప్రయత్నించాలి. పోషకాహారం తీసుకోవాలి. షిఫ్టుని బట్టి సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాయామానికి కాస్త సమయం కేటాయించాలి.
News December 16, 2025
స్పెషల్ రీఛార్జ్.. ఫోన్ పోతే రూ.25వేల ఇన్సూరెన్స్

వినియోగదారులను ఆకర్షించేందుకు వొడాఫోన్ ఐడియా (Vi) వినూత్న ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్యాక్‌ల ద్వారా మొబైల్ పోగొట్టుకున్నా లేదా పాడైపోయినా ₹25,000 వరకు బీమా పొందే అవకాశం ఉంటుంది. ₹61 రీఛార్జ్‌తో 30రోజులు బీమాతో పాటు 2GB(15D), 6 నెలల కోసం ₹201, ఏడాది పాటు ఇన్సూరెన్స్ పొందాలంటే ₹251తో రీఛార్జ్ చేసుకోవాలి. ఎయిర్‌టెల్, జియో కూడా ఇలాంటి ప్లాన్ తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది.
News December 16, 2025
సరిహద్దుల్లో కంచె నిర్మాణం.. ఎంత పూర్తయిందంటే?

దేశ భద్రతను పటిష్ఠం చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దుల వెంట కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. లోక్‌సభలో కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ దీని వివరాలు వెల్లడించారు. ఇండియా-పాక్ 93.25% (2,135KMS), IND-బంగ్లాదేశ్ సరిహద్దులో 79.08% (3,239KMS) మేర కంచె నిర్మాణం పూర్తయిందన్నారు. IND-మయన్మార్ సరిహద్దులో 1,643 కి.మీల మేర పనులు జరుగుతున్నాయన్నారు.


