News October 13, 2025

జెఫ్ బెజోస్ మాజీ భార్య రూ.372 కోట్ల విరాళం

image

అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ మరోసారి భారీ విరాళంతో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శాన్ రాఫెల్‌కు చెందిన ‘10,000 డిగ్రీస్’ అనే సంస్థకు $42 మిలియన్లు(దాదాపు రూ.372 కోట్లు) విరాళం అందించారు. ‘నేటివ్ ఫార్వర్డ్’ అనే సంస్థకు గతంలో $10 మిలియన్ల విరాళమిచ్చారు. ఆమె ఇచ్చిన డబ్బును ఈ సంస్థలు వాటి అవసరాలకు తగ్గట్లు వాడుకోవచ్చు. ఈ పనికే వాడాలి అనే ఆంక్షలు విధించరు.

Similar News

News October 13, 2025

సంక్రాంతి నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్‌ సేవలు!

image

TG: హెలీ టూరిజానికి రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్‌లోని రామప్ప, లక్నవరానికీ విస్తరించాలని యోచిస్తోంది. ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్‌సైట్ తీసుకురానుంది.

News October 13, 2025

చైనా- పీఆర్23 వరి వంగడం ప్రత్యేకతలు ఇవే

image

చైనా PR-23 వరిని ఒక్కసారే నాటి మూడేళ్లలో 6 పంటలను కోసే అవకాశం ఉండటంతో సాగు ఖర్చు 29% తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. పంట 119 రోజుల్లోనే కోతకు వస్తుంది. తొలి కోతలో హెక్టారుకు 6.8-7.5 టన్నులు, తర్వాత కోతల్లో 5.4-6.3 టన్నుల దిగుబడి వస్తోంది. భారత్‌లో సగటు వరి దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులే. ఆసియా, ఆఫ్రికాలోని 17 దేశాల్లో విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో కూడా PR-23 వంగడం మెరుగైన దిగుబడినిస్తోంది.

News October 13, 2025

కర్రెగుట్టల్లో CRPF ట్రైనింగ్ స్కూల్!

image

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో కమాండో ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని CRPF ప్లాన్ చేస్తోంది. ఇందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించేందుకు సర్వే జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ఆపరేషన్ తర్వాత అక్కడ IEDs, బాంబులను నిర్వీర్యం చేసేందుకు ఎక్సర్‌సైజ్ చేపట్టాం. ఆ పని పూర్తికావచ్చింది. శాశ్వత స్థావరం ఏర్పాటు కోసం లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రా అంశాలను పరిశీలిస్తున్నాం’ అని చెప్పాయి.