News June 16, 2024

ఐస్‌క్రీమ్‌లో జెర్రి

image

ఇటీవల మహారాష్ట్రలో ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మనిషి వేలు కనిపించిన ఘటన మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. యూపీలోని నోయిడాకు చెందిన దీపాదేవి తన కొడుకు కోసం బ్లింకిట్‌లో అమూల్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశారు. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో జెర్రి కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే బ్లింకిట్‌కు ఫిర్యాదు చేయగా ఐస్‌క్రీమ్ ధర రూ.195ను ఆమెకు రీఫండ్ చేసింది. విషయాన్ని అమూల్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.

Similar News

News November 28, 2025

మరోసారి మెగా పీటీఎం

image

AP: మరోసారి మెగా పేరెంట్-టీచర్స్ మీట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. DEC 5న జూనియర్ కాలేజీలతో పాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ మాట్లాడనున్నారు. మంత్రి లోకేశ్ మన్యం జిల్లాలో నిర్వహించే మెగా పీటీఎం‌లో పాల్గొంటారు. గతేడాది మొదటిసారి, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రెండోది, వచ్చే నెల మూడో మెగా పీటీఎం జరగనుంది.

News November 28, 2025

వైకుంఠ ద్వార దర్శనం: లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వకపోతే..?

image

వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉంటుంది. అందులో మొదటి 3 రోజులు మాత్రమే లక్కీ డిప్ ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. లక్కీ డిప్‌లో సెలక్ట్ అవ్వని భక్తులకు నిరాశ అనవసరం. JAN 2 – JAN 8వ వరకు రోజుకు 15K చొప్పున విడుదలయ్యే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకున్న అందరికీ వైకుంఠ ద్వారం గుండా దర్శనం లభిస్తుంది. ఇవి DEC 5న విడుదలవుతాయి. ఫాస్ట్‌గా బుక్ చేసుకోవాలి.

News November 28, 2025

త్వరలో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

త్వరలో <>BSNL<<>> 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బీఈ, బీటెక్, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు 21- 30ఏళ్ల వయసు గలవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.24,900-రూ.50,500 చెల్లిస్తారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్‌లో దరఖాస్తు, పరీక్ష తేదీ వివరాలను వెల్లడించనున్నారు. వెబ్‌సైట్: https://bsnl.co.in/