News February 18, 2026
JGL: కాంగ్రెస్ అధిష్ఠానంతో జీవన్‌రెడ్డి ‘తాడోపేడో’!

మాజీ మంత్రి జీవన్ రెడ్డి చాలా రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకొని అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై హైకమాండ్‌తో చర్చించడానికి ఆయన మంగళవారం ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీ మార్పు లేదా కీలక పదవి లక్ష్యంగా తాడోపేడో తేల్చుకునేందుకు ఈ పర్యటన సాగుతోందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం బుజ్జగిస్తుందా లేక ఆయన కఠిన నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
Similar News
News February 21, 2026
PDPL: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

PDPL రీజినల్ టాస్క్ సెంటర్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలోని సెంటర్‌లో జావా, పైథాన్, సీ, సీ++, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్‌టీ, మెడికల్ కోడింగ్, ఆప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు FEB 28లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.
News February 21, 2026
యాంటీ బాలిస్టిక్ మిస్సైల్స్‌పై భారత్ ఫోకస్

ఈ నెల 25, 26 తేదీల్లో PM మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక, రక్షణ సంబంధాలపై చర్చ జరగనుంది. మోదీ గతంలో ప్రకటించిన ‘మిషన్ సుదర్శన్’లో భాగంగా యాంటీ బాలిస్టిక్ మిస్సైల్స్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధి, లేజర్ ఆయుధాలు, లాంగ్‌రేంజ్ మిస్సైల్స్‌పై ఫోకస్ చేయనున్నారు. ఈ రంగాల్లో $10bn డిఫెన్స్ ట్రేడ్‌కు పునాదులు పడనున్నాయి. అలాగే ఆ దేశ PM నెతన్యాహుతో కలిసి మోదీ <<19160160>>పార్లమెంటులో<<>> ప్రసంగించనున్నారు.
News February 21, 2026
HYD: మాతృ భాష ‘బతుకు’నిచ్చింది!

“దేశ భాషలందు తెలుగు లెస్స” ఇది శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన వేదం. సమాజంలో తెలుగు భాషను లోకువ చేసే బ్యాచ్ తెలుసుకోవాల్సిన నిజం. మాతృ భూమి, భాషను నమ్ముకొన్న వాడు ఎక్కడా మోసపోలేదు. తెలుగు, సాహిత్యం మీద పట్టు పెంచుకొన్న ఎందరో కవులు చరిత్రలో నిలిచారు. లక్షలాది మందిని గొప్ప జర్నలిస్టులను చేసింది ఈ మాతృభాషనే. భాషను బతికించుకున్న ఎందరికో బతుకునిచ్చిందని మర్చిపోకండి.
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.


