News February 24, 2026

JGL: మావోయిస్టు మాజీ చీఫ్ గణపతి ఎక్కుడ..?

image

మావోయిస్టు మాజీ చీఫ్ ముప్పల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నారనేది ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. మావోయిస్టు పార్టీ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన నాయకుడు, ఎందరికో ఆదర్శంగా ఉంటూ ఉద్యమాన్ని నడిపించిన జగిత్యాల జిల్లా బీర్పూర్‌కు చెందిన గణపతి 70 ఏళ్లు దాటి వయస్సు పైబడటంతో మిగతా వారికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారం లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News February 25, 2026

NLG: సెల్లులు స్విచాఫ్.. అజ్ఞాతంలో రైస్ మిల్లర్లు..!

image

జిల్లాలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యం కుంభకోణానికి పాల్పడిన మిల్లర్లు పోలీసులకు దొరకకుండా పరారయ్యారు. తమపై కేసులు నమోదు కాబోతున్నాయనే ముందస్తు సమాచారంతో శనివారం నుంచే వారంతా ఫోన్లు స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పందించారు. ప్రభుత్వ ధాన్యాన్ని లూటీ చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామన్నారు.

News February 25, 2026

లలితా సహస్ర నామాలు పఠిస్తే..?

image

లలితా సహస్రనామ పారాయణం సకల కోరికలను నెరవేర్చే మహామంత్రం. అగస్త్యుడి కోరిక మేరకు హయగ్రీవుడు ఈ వెయ్యి నామాలను ఉపదేశించారు. ఈ స్తోత్రం 183 శ్లోకాల సమాహారం. దీనిని భక్తితో, ఉచ్చారణ దోషాలు లేకుండా పారాయణం చేస్తే అపమృత్యువు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ‘ప్రతి నామం ఓ మంత్రం. అర్థం తెలుసుకుని చదివితే అఖండ ఫలితముంటుంది. సృష్టికి మూలమైన ఆ తల్లి అనుగ్రహం కోసం ఇది శ్రేష్ఠం’ అంటున్నారు పండితులు.

News February 25, 2026

పాలమూరు: శ్రీరంగాపురం వెళ్తున్నారా?

image

వనపర్తి(D) శ్రీరంగాపురం రంగనాథస్వామి గుడి ఉమ్మడి MBNR జిల్లాలోని పురాతన వైష్ణవాలయాల్లో ఒకటిగా పేరొందింది. సుమారు 340 ఏళ్ల క్రితం వనపర్తి సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు హయాంలో దీనిని నిర్మించారని చరిత్ర చెబుతోంది. రంగ సముద్రం చెరువు ఒడ్డున ఉన్న ఈ గుడి అద్భుత శిల్ప కళతో భక్తులను కట్టిపడేస్తోంది. కాగా నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవనుండగా మార్చి 6 వరకు జరగనున్నాయి. SHARE IT