News October 28, 2024
JGTL: తమ్ముడి మృతి.. తట్టుకోలేక కుప్పకూలిన అక్క

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. తాటిపల్లి గ్రామానికి చెందిన జలపతి(55) నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన జలపతి తోడబుట్టిన అక్క సింక రాజవ్వ(80) తమ్ముడి మరణ వార్తను తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ రావడంతో తమ్ముడి మృతదేహం వద్దనే కుప్పకూలి చనిపోయారు. ఇరువురి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News September 18, 2025
KNR: ‘పని ప్రదేశాల్లో ఫిర్యాదుల కమిటీ తప్పనిసరి’

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News September 18, 2025
‘కేసీఆర్ కుటుంబం తెలంగాణను అప్పులపాలు చేసింది’

తెలంగాణను KCR కుటుంబం అప్పుల పాలు చేసిందని PCC ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం మండిపడ్డారు. KNRలోని R&B గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో హరీశ్‌రావు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించగా, KCR సూత్రధారి అని హరీశ్‌రావు విచారణలో చెప్పారని అన్నారు. నయీం ఆస్తులను KCR తన ఖజానాలో జమచేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని గజ్జల కాంతం తీవ్ర ఆరోపణలు చేశారు.
News September 18, 2025
KNR: ‘ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి’

అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విద్యానగర్ లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజి ఉండడం ద్వారా అంతర్జాతీయంగా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు.