News March 24, 2025
JGTL: నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అడ్మిషన్లు.. ప్రజావాణిలో యువకుడి వినతి

ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా బీసీ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు బోగోజీ ముకేశ్ ఖన్నా ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 2025-26 అడ్మిషన్లు ప్రారంభించి, ఫ్లెక్సీల ద్వారా తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఫ్లెక్సీల తొలగింపుతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News December 6, 2025
కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.
News December 6, 2025
రంగారెడ్డి: FREE కోచింగ్.. నేడే లాస్ట్!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ. అలీఖాన్ Way2Newsతో తెలిపారు. సీసీటీవీ కోర్సులలో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19- 45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, 4 ఫొటోలతో ఈనెల 6లోగా దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 8500165190కు సంప్రదించాలన్నారు. #SHARE IT.
News December 6, 2025
దొరవారిసత్రం PSలో పోక్సో కేసు.. ముద్దాయికి 3 ఏళ్ల శిక్ష.!

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని కృష్ణాపురంలో జరిగిన పోక్సో కేసులో కల్లెంబాకం సుమన్కు నెల్లూరు పోక్సో కోర్టు 3 సంవత్సరాల కఠిన జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించింది. బాధితురాలిని 2022 డిసెంబర్ 6న కత్తితో బెదిరించి అక్రమంగా తాకిన ఘటనపై Cr.No.79/2022 కింద కేసు నమోదు కాగా.. 354(A), 506 IPC- POCSO సెక్షన్ 7 r/w 8 కింద నేరం రుజువైంది.


