News March 17, 2025

JGTL: హాట్ టాపిక్‌గా KTR, తీన్మార్ మల్లన్న భేటీ..!

image

KTR, హరీశ్ రావు, తీన్మార్ మల్లన్న HYDలో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పుల్లా ఉండే వీరి భేటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బీఆర్ఎస్ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన వీరి అనూహ్య భేటీపై మీ కామెంట్.

Similar News

News March 18, 2025

లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ

image

కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను మెగాస్టార్‌కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.

News March 18, 2025

VKB: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి

image

వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నియామకమయ్యారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం బీజేపీ సీనియర్ నాయకులు శివరాజ్, సదానందరెడ్డి, రమేశ్, కేపీ రాజు, వడ్ల నందు, రాజశేఖర్ రెడ్డి పోటీ పడ్డారు. కాగా అధ్యక్ష పదవి రాజశేఖర్ రెడ్డికి వరించింది. తన నియామకానికి సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

News March 18, 2025

సవిత షటిల్.. పరిటాల సునీత క్యారమ్స్‌

image

విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నేటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. టెన్నికాయిట్, టగ్‌ ఆఫ్‌ వార్, షటిల్‌ బ్యాడ్మింటన్‌లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్‌లో ఆడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత తన పేరును నమోదు చేసుకున్నారు. 100M పరుగు పందెంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పోటీ పడనున్నారు. మడకశిర ఎమ్మెల్యే రాజు క్రికెట్ ఆడనున్నారు.

error: Content is protected !!