News August 20, 2025
JGTL: అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి అడ్లూరి

మహారాష్ట్రలో ఉద్గిర్ వరదల్లో చిక్కుకుని మృతిచెందిన JGTL TRనగర్‌కు చెందిన మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం వరదల్లో చిక్కుకుని మృతిచెందిన సమీనా, హసీనా, అఫ్రిన్ కుటుంబసభ్యులను వారు పరామర్శించారు. ఈ విషయంపై CM దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరఫున సాయం చేస్తామన్నారు.
Similar News
News August 20, 2025
సినీ రంగంలోనూ AI ప్రభావం.. నటీనటులకు గడ్డుకాలమేనా?

ఉద్యోగుల్లో భయాన్ని రేకెత్తిస్తోన్న AI ఇప్పుడు సినీ ఫీల్డ్‌నూ తాకింది. ఇప్పటికే పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో నటీనటులు లేకపోయినా భావోద్వేగాలను సృష్టించొచ్చు అని ఇది నిరూపించింది. ఈక్రమంలో ఏఐతో సినిమాలు తీయడంపై బాలీవుడ్ దృష్టి పెడుతోంది. రామాయణ్, చిరంజీవి హనుమాన్ వంటి చిత్రాలను ఏఐతో రూపొందిస్తోంది. దీనిపై మీ కామెంట్?
News August 20, 2025
కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన నంద్యాల ఎంపీ

ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్‌ను బుధవారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని బెడ బుడగ జంగం కమ్యూనిటీని షెడ్యూల్డ్ కాస్ట్ జాబితాలో చేర్చే ప్రతిపాదనపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు.
News August 20, 2025
మచిలీపట్నం: ధాన్యం సేకరణపై కలెక్టర్ సమీక్ష

ధాన్యం సేకరణపై కలెక్టర్ డీకే బాలాజీ జేసీ గీతాంజలి శర్మతో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. నవంబర్ మొదటి వారంలో వరి పంట చేతికి రానున్నందున రైతు సేవా కేంద్రాలు, మిల్లర్లు, గోనె సంచులు, రవాణా వాహనాలు, ఎఫ్‌సీఐ గోదాములు సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.