News January 11, 2026

JGTL: ఆఖరి మజిలీకి ముందే సమాధి నిర్మాణం.. అందులోనే అంత్యక్రియలు

image

మరణం అనివార్యం.. చివరి ప్రయాణమే గౌరవంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్(M) లక్ష్మీపూర్‌కు చెందిన నక్క ఇంద్రయ్య తన చివరి మజిలీకి ముందే తన తోటలోనే రూ.12 లక్షలు పెట్టి గ్రానైట్‌తో సమాధిని నిర్మించుకున్నారు. అప్పట్లో అది చాలా వైరల్‌గా మారింది. అయితే, ఇంద్రయ్య శనివారం మృతి చెందడంతో తన కోరిక ప్రకారం ముందే నిర్మించిన సమాధిలో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాటు చేయడం విశేషం.

Similar News

News February 27, 2026

నూకపల్లి న్యాక్ సెంటర్లో సర్పంచులకు శిక్షణ తరగతులు

image

మల్యాల మండలం నూకపల్లి న్యాక్ సెంటర్‌లో నిర్వహిస్తున్న సర్పంచ్ ల శిక్షణ తరగతులకు శుక్రవారం వివిధ మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు. ఈ శిక్షణ తరగతుల వల్ల సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధి ప్రణాళికలు, పంచాయతీరాజ్ చట్టాలు, గ్రామసభల నిర్వహణ, నిధుల వినియోగం, పరిపాలన వంటి అంశాలపై నిపుణులు మహేశ్వర్ రెడ్డి అవగాహన కల్పించారు..

News February 27, 2026

తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

రాబోయే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, గ్రామాల్లో నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News February 27, 2026

HYD: Gen Z తెలివి.. ‘చెత్త’ నుంచి డబ్బు!

image

HYD యువతలో ఇప్పుడు ‘అప్‌సైక్లింగ్’ ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్‌గా మార్చి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న ‘యూనిక్’ ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్. వ్యర్థాలను అర్థాలుగా మార్చుతున్న ఈ Gen Z తెలివితేటలు అమోఘం.