News August 29, 2025

JGTL: ఏడాది క్రితం మిస్సింగ్.. 2రోజుల క్రితం అస్థిపంజరం లభ్యం

image

మెట్‌పల్లి మం. రాజేశ్వరరావుపేటకి చెందిన విద్యార్థి నోముల రిశ్వంత్ ఏడాది క్రితం తప్పిపోగా 2రోజుల క్రితం అస్థిపంజరంగా కేదార్నాథ్‌లో లభ్యం కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. రిశ్వంత్ పంజాబ్లోని ఓ యూనివర్సిటీలో బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు. గతేడాది AUGలో ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. కానీ, కళాశాలకు చేరకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News September 1, 2025

మేడ్చల్: ప్రజావాణిలో 88 దరఖాస్తుల స్వీకరణ

image

మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 88 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ మనూ చౌదరి, అదనపు కలెక్టర్లు రాధికాగుప్త, విజయేందర్ రెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని సూచించారు.

News September 1, 2025

శామీర్‌పేట్: సీపీఎస్‌ను రద్దు చేయాలని నిరసన

image

సీపీఎస్‌ను రద్దు చేయాలని 206 సంఘాలుగా ఏర్పడిన మేడ్చల్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్ దారుల సంఘం సభ్యులు అంతాయిపల్లిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. సీపీఎస్‌ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను మరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

News September 1, 2025

HYD: మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం HYD మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ వద్ద సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 46,000 ట్యాంకుల్లో చేపల పెంపకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.122 కోట్లు విడుదల చేసినట్లుగా తెలిపారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లుగా చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి, మెట్టు సాయి ఉన్నారు.