News September 10, 2025
JGTL: క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన SP

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను మంగళవారం జిల్లా కేంద్రానికి చెందిన పలువురు క్రికెట్ క్రీడాకారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈనెల 21 నుంచి 28 వరకు నిర్వహించే జగిత్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జగిత్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 10, 2025
BHPL: థర్మల్ పవర్ ప్రాజెక్టులో విషాదం.. కార్మికుడు మృతి

గణపురం మండలం చెల్పూర్ వద్ద ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విషాదం చోటుచేసుకుంది. కొంపెల్లి గ్రామానికి చెందిన తూన్ల సురేష్ అనే ఆర్టిజన్ కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. నిన్న విధులకు వచ్చి కనిపించకుండా పోయిన సురేష్ మృతదేహం ఈ రోజు సంపులో లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News September 10, 2025
సిరిసిల్ల: జిల్లాలో 10,234 ఇండ్ల మంజూరు

చిత్తశుద్ధితో పనిచేస్తూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 10,234 ఇండ్లను మంజూరు చేయగా 5,301 మార్కింగ్ జరిగాయన్నారు. 3,230 బేస్మెంట్ స్థాయికి, 192 గోడల దశకు, 643 రూఫ్ వరకు, ఒక ఇల్లు పూర్తైందన్నారు.
News September 10, 2025
BHPL: ‘చాకలి ఐలమ్మ జీవితం నేటి తరాలకు ఆదర్శం’

సమాజంలో అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయక జీవితం నేటి తరాలకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఐడిఓసిలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.