News September 8, 2025

JGTL గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన సదస్సు

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో JGTL గురుకులంలో విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మిషన్ శక్తి, జిల్లా మహిళా సాధికారత బృందం ఈ 10 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భవానీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ సదస్సు నిర్వహించింది. రుతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News September 8, 2025

వరంగల్ పోలీసుల హెచ్చరిక

image

సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి టిప్స్, లింక్‌లను నమ్మి తెలియని యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లలో డబ్బులు పెట్టి మోసపోకూడదని వరంగల్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. షేర్లలో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ అకౌంట్స్ ద్వారానే జరుగుతుందని గుర్తుంచుకోవాలని పోలీసులు సూచించారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలన్నారు.

News September 8, 2025

వరంగల్: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి గుబ్బెటి తండాలో సపావత్ సురేశ్ అనే వ్యక్తి తన తండ్రి రాజు(50)ను కడతేర్చిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని ఏసీపీ అంబటి నరసయ్య ఈరోజు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య చేశాడని, సురేశ్‌ను కోర్టులో హాజరుపరచి, రిమాండ్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News September 8, 2025

KMR: హైవేపై వేగంగా వెళ్తున్నారా జాగ్రత్త

image

వాహనాల వేగాన్ని నియంత్రించి, ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధాన ఉద్దేశమని SP రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. ఎన్‌హెచ్-44లోని సదాశివనగర్ లిమిట్స్‌లో స్పీడ్ లేజర్ గన్స్‌ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 3 స్పీడ్ లేజర్ గన్స్ పని చేస్తున్నాయని ఎస్పీ చెప్పారు. NH-44, 161, రాష్ట్ర రహదారులపై అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి చలానాలు జారీ చేస్తామన్నారు.