News September 10, 2025

JGTL జిల్లా విద్యుత్ శాఖ ఇంజినీర్స్ కార్యవర్గం ఏకగ్రీవం

image

JGTL జిల్లా TG పవర్ డిప్లోమా ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాధ్యక్షుడిగా బీ.సుందర్, అడ్వైజర్‌గా యం.సదశివారెడ్డి, కార్యదర్శిగా పి.వరుణ్ కుమార్, కోశాధికారిగా ఎం.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎల్.రాజు, ఆఫీసు సెక్రటరీగా ఎస్.రంజిత్, లేడీ రెప్రజెంటేటివ్‌గా ఎస్.మౌనిక ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News September 10, 2025

కామారెడ్డి జిల్లాలో 274 ఆత్మహత్యలు

image

కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 274 ఆత్మహత్యలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అనారోగ్యం, ప్రేమ వ్యవహారాలు వంటి అనేక కారణాల వల్ల పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలన్నారు.

News September 10, 2025

VKB: ఐలమ్మ పోరాటపటిమను ఆదర్శంగా తీసుకోవాలి: అ.కలెక్టర్

image

భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన చాకలి ఐలమ్మ పోరాటపటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

News September 10, 2025

సిద్ధార్థ్ మాల్యాతో అందుకే బ్రేకప్: దీపికా పదుకొణె

image

తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ మాల్యాతో బ్రేకప్‌పై హీరోయిన్ దీపికా పదుకొణె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘సిద్ధార్థ్ బిహేవియర్ దారుణంగా ఉంటుంది. మేం ఇద్దరం కలిసి చివరిసారిగా డిన్నర్‌కు వెళ్లినప్పుడు నన్ను బిల్ పే చేయమన్నాడు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అతడితో రిలేషన్ కొనసాగించడానికి నాకు ఒక్క ఆప్షన్ కూడా కనిపించలేదు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రణ్‌వీర్‌ను దీపిక పెళ్లాడారు.