News October 7, 2025
JGTL: నిరుపేద విద్యార్థులకు భారంగా మారిన విద్య

JGTL పట్టణంలోని శ్రీ చైతన్య జాబితాపూర్, చుక్కారామయ్య సహా పలు ప్రభుత్వ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా పేద విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. కాగా, ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫీజుల బిల్లులు రాలేదని విద్యార్థులను లోపలికి రానీయకుండా బయటికు పంపేశారు. కలెక్టరేట్‌కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినా తిరస్కరించారని, రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.
Similar News
News October 7, 2025
చిత్తూరు: ధరలు తగ్గింపు పై అవగాహన కల్పించాలి

సూపర్ జీఎస్టీతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 7, 2025
వికారాబాద్: మైనార్టీలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం లేదు: మాజీ ఎమ్మెల్యే

మైనార్టీలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం లేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ఎన్నెపల్లిలోని BRS భవన్‌లో పార్టీ పట్టణ మైనారిటీ నాయకులతో సమావేశం అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ముస్లిం మైనారిటీలు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టణ మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
News October 7, 2025
నిర్మల్: చెరువులో దూకి ఇద్దరు అన్నదమ్ముల మృతి

ఇద్దరు అన్నదమ్ములు చెరువులో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ బంగల్పేట్ చెరువులో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన నరేష్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తమ్ముడు నవీన్ కాపాడడానికి వెళ్లాడు. దీంతో ఇద్దరు చెరువులో మునిగిపోయి చనిపోయారు. జాలర్లు మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.