News November 21, 2025
JGTL: నూతన MPDO/ MPOలతో కలెక్టర్ కీలక సమావేశం

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ నూతనంగా నియమితులైన MPDO/ MPOలతో సమావేశమై ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధిపై సమీక్షించారు. గ్రామీణ పరిపాలనలో తమ పాత్ర కీలకమని, ప్రజలకు సేవలను పారదర్శకంగా అందించాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన, MGNREGS, హౌసింగ్, SBM, JJM వంటి పథకాల వేగవంతమైన అమలు, అవినీతిపై జీరో టాలరెన్స్ పాటించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాజగౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
చీకటి తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్లకూడదా?

చీకటి పడ్డాక రావి చెట్టు వద్దకు వెళ్తే దెయ్యాలు, దుష్ట శక్తులు సంచరిస్తాయని పెద్దలు అంటుంటారు. కానీ ఇదొక అపోహ మాత్రమే. దీని వెనుక వృక్షశాస్త్ర రహస్యం ఉంది. రాత్రిపూట రావి చెట్టు పెద్ద మొత్తంలో చెడు గాలిని విడుదల చేస్తుంది. దానిని పీల్చడం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని గురించి శాస్త్రీయంగా వివరించలేక దెయ్యాల పేర్లు చెప్పేవారు. అలా జనాలను ఈ చెట్టు వద్దకు వెళ్లకుండా చేసేవారు.
News November 24, 2025
‘తేజస్’ ప్రమాదంపై స్పందించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ <<18349994>>కూలిపోయిన<<>> ఘటనపై తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్పందించింది. ఇది అసాధారణ పరిస్థితుల వల్ల జరిగిన ఘటన అని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ ప్రమాదాన్ని విమానం పనితీరుకు ప్రతిబింబంగా చూడకూడదు. ఇది మా వ్యాపార కార్యకలాపాలు, భవిష్యత్తు డెలివరీలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. దర్యాప్తుకు సహకరిస్తున్నాం’ అని తెలిపింది.
News November 24, 2025
ప్రజా సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో విచారించి సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన తదితర అధికారులు పాల్గొన్నారు.


