News November 17, 2025
JGTL: నేడే క్యాబినెట్ భేటీ.. రిజర్వేషన్ల పంచాయితీ తేలేనా..?

బీసీ రిజర్వేషన్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర క్యాబినెట్ భేటీ నేడు జరగనుండగా, ఎన్నికలపై ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. రోజులు గడిచేకొద్దీ ఎన్నికలు ఎప్పుడూ జరుగుతాయోనని ఆశావహులంతా ఎదురుచూస్తున్నారు. కనీసం నేటితోనైనా ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి. కాగా ఉమ్మడి జిల్లాలో 1216 GPలు, 60 ZPTCలు, 646 MPTC స్థానాలున్నాయి.
Similar News
News November 17, 2025
నంద్యాల: ‘కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వాలి’

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాలలో కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం చెల్లింపు, ఎన్యూమరేషన్‌లో లోపాలను సవరించాలని కోరారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

66 ఏళ్ల రికార్డు.. ఇండియాలో ఫస్ట్ టైమ్ నమోదు!

నిన్న దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియాకు అనూహ్య <<18303459>>ఓటమి<<>> ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ కొత్త రికార్డు నమోదైంది. భారత్‌లో ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్సులు పూర్తయి కనీసం ఒక్కదాంట్లోనూ 200కు పైగా పరుగులు చేయకపోవడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా టెస్టుల్లో 12 సార్లు ఇలా జరిగింది. చివరిసారిగా 66 ఏళ్ల క్రితం ఈ తరహా రికార్డు నమోదైంది.