News October 4, 2025
JGTL: పురుగుమందు తాగి మీసేవా ఓనర్ మృతి

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన మటేటి శేఖర్(44) పురుగుమందు తాగి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం జగిత్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కాగా, శేఖర్ గ్రామంలో మీసేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శేఖర్ మృతి వార్తతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 4, 2025
కాకినాడ కలెక్టర్‌కు పెనాల్టీ వేస్తారా..!

కాకినాడలో శనివారం జరిగిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి మంత్రి నారాయణ, ఎంపీ సానా సతీశ్ ఆటో నడుపుతూ వచ్చినప్పుడు డ్రైవర్ సీటు పక్కన జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ కూర్చున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం డ్రైవర్ పక్కన ఎవరూ కూర్చోకూడదు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఇప్పుడు నెటిజన్లు “ఇది చట్ట విరుద్ధం, కలెక్టర్‌కు పెనాల్టీ వేయండి” అంటూ విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ఇంకా కలెక్టర్ స్పందించలేదు.
News October 4, 2025
‘ఇసుక తవ్వకాలపై జిల్లా స్థాయి నివేదిక సమర్పించాలి’

ఇసుక తవ్వకాలపై జిల్లా స్థాయి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గల సాంకేతిక శాఖలైన నీటిపారుదల, భూగర్భజల, గనులు, భూగర్భశాఖ, ప్రాజెక్ట్ ఆఫీసర్, TSMDC, ఫారెస్ట్, రెవెన్యూ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వారి కార్యాలయాలను ఆదేశించారు. ఈ నివేదిక జిల్లా వెబ్ సైట్ https://kothagudem.telangana.gov.in లో ప్రజల సమాచారం కోసం పొందుపర్చాలని తెలిపారు.
News October 4, 2025
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ సన్నాహక సమావేశం

ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుదని అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. బేల, భోరజ్, జైనథ్ మండల నాయకులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. పోటీకి సిద్ధంగా ఉండే ఆశావహులు, వారి బలాబలాలపై సమీక్షించారు.