News October 23, 2025

JGTL: పెళ్లి పత్రికలు ఇచ్చొస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

image

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి సమీపంలోని రైతు వేదిక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెగడపల్లి SI కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల మండలం సోమన్పల్లికి చెందిన చెట్ల వంశీ, ఉప్పెర రంజిత్ ద్విచక్రవాహనంపై మండలంలోని ఐతుపల్లిలో పెండ్లి పత్రికలు ఇచ్చి తిరిగి వస్తుండగా, వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News October 24, 2025

MBNR: హంస వాహనంపై కురుమూర్తిరాయుడి విహారం

image

ఉమ్మడి MBNR జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు హంస వాహనంపై విహరించారు. భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారిని దేవతాద్రి కొండలోని కాంచన గుహ నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగించారు.

News October 24, 2025

WWC 2025: సెమీస్ చేరిన జట్లివే..

image

మహిళల వన్డే వరల్డ్ కప్(WWC) 2025లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. NZతో మ్యాచులో విజయంతో టీమ్‌ఇండియా సెమీస్ చేరింది. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్‌కు ముందు ఈ జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నెల 26న బంగ్లాతో మ్యాచులో భారత్ గెలిచినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనే ఉండనుంది. అటు మిగతా 3 జట్ల ప్రదర్శన టాప్-3 స్థానాలను ఖరారు చేయనుంది.

News October 24, 2025

RGM: అలా చేస్తే.. ఆస్తి పన్నులో 10% డిస్కౌంట్..!

image

రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) J.అరుణశ్రీ గురువారం నిర్వహించిన సమావేశంలో ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించేందుకు ప్రజల్లో చైతన్యం పెంచాలని ఆదేశించారు. జలశక్తి అభియాన్‌లో డిసెంబర్ 31 నాటికి 10వేల గుంతలు నిర్మించడం లక్ష్యమన్నారు. ఇంటి యజమానులు స్వయంగా గుంత నిర్మిస్తే ఆస్తి పన్నులో 10% రాయితీ లభిస్తుందన్నారు. నల్లా కనెక్షన్ వివరాలు అమృతం యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.