News October 22, 2025

JGTL: పెళ్లై నెల కాలేదు.. నవదంపతుల సూసైడ్..!

image

కూర విషయంలో తలెత్తిన గొడవ నవదంపతులను కన్నవారికి దూరం చేసింది. JGTLలో జరిగిందీ విషాదం. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండివాసులు గంగోత్రి, సంతోశ్ SEPT 26న లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దసరాకు అత్తింటికి వెళ్లిన సంతోశ్ భోజనం చేస్తుండగా మటన్‌‌ కూర బాలేదంటూ భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపంతో గంగోత్రి పండగరోజే సూసైడ్ చేసుకుంది. తట్టుకోలేకపోయిన సంతోశ్ నువ్వు లేని జీవితం నాకొద్దంటూ దీపావళి రోజు ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News October 22, 2025

వరంగల్: ఆకతాయిలు వేధిస్తే సమాచారం ఇవ్వండి!

image

మహిళలు, విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఇన్‌స్పెక్టర్ సుజాత కోరారు. సుబేదారిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డయల్ 100, సైబర్ క్రైమ్, టీసేవ్ యాప్‌తో పాటు షీ టీం సేవలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దని, 8712685142కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.

News October 22, 2025

నాగులచవితికి విశాఖ జూ పార్కు వేళల్లో మార్పు!

image

నాగులచవితి పండగ సందర్భంగా విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ వేళల్లో మార్పులు చేశారు. శనివారం రోజు సందర్శకుల కోసం పార్కును సాధారణ సమయం కంటే ముందుగా ఉదయం 7:30 గంటలకే తెరవనున్నట్లు క్యూరేటర్ మంగమ్మ ప్రకటించారు. జూ లోపల పటాకులు, పేలుడు పదార్థాలు వంటి నిషేధిత వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News October 22, 2025

బకాయిలు అడిగితే బ్లాక్‌మెయిల్ చేస్తారా.. ప్రభుత్వంపై బండి ఫైర్

image

TG: ఫీజు బకాయిలు అడిగిన విద్యాసంస్థలను విజిలెన్స్ దాడులతో బ్లాక్‌మెయిల్ చేస్తారా అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బిహార్ ఎన్నికలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపే సర్కార్.. విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేదా అని ప్రశ్నించారు. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దని, అండగా ఉంటామని విద్యాసంస్థలకు భరోసా ఇచ్చారు.