News October 15, 2025

JGTL: పేదల సంక్షేమం కోసం కృషి చేస్తా: MLC రమణ

image

పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని MLC రమణ పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో 15 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2,65,500 విలువగల చెక్కులను ఎమ్మెల్సీ రమణ లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో BRS నాయకులు గట్టు సతీష్, తేలు రాజు, అల్లాల ఆనంద్ రావు, బర్కాం మల్లేశం, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 15, 2025

సీఎంఆర్ సమర్పించిన వారికే ధాన్యం: వనపర్తి కలెక్టర్

image

గత ఖరీఫ్ సీజన్ 2024-25లో వరి ధాన్యం పొందిన వారిలో వంద శాతం CMR సమర్పించిన వారికే ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం కేటాయిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం NIC కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 12లోపు పెండింగ్ సీఎంఆర్ పూర్తి చేసి కొత్త ధాన్యం పొందడానికి సహకరించాలని రైస్ మిల్లర్లకు సూచించారు.

News October 15, 2025

రోడ్డు భద్రత కోసం అన్నమయ్య పోలీసుల ‘బొమ్మ’ కథ

image

ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న రహదారులపై ప్రాణాలను కాపాడేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తుపాకులు, లాఠీల కంటే సృజనాత్మక ఆలోచనే గొప్ప ఆయుధం అని నిరూపించేలా, మదనపల్లె సబ్-డివిజన్ యంత్రాంగం ఒక వినూత్న ‘కటౌట్ కథ’ ను ప్రారంభించింది. కానిస్టేబుల్ ఆకారపు బొమ్మను ఉంచారు. ఈ కటౌట్‌లను చూసిన వాహనదారులు, నిజంగానే పోలీసులు తనిఖీ అని భ్రమపడి, వెంటనే వేగాన్ని తగ్గించుకుంటున్నారు.

News October 15, 2025

తెనాలి: Way2News కథనానికి స్పందన

image

‘నో స్టాక్’ బోర్డు పేరుతో రేషన్ షాపులపై Way2Newsలో వచ్చిన <<18010930>>కథనానికి <<>>తహశీల్దార్ గోపాలకృష్ణ స్పందించారు. బుధవారం ఆయన పలు రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నాజరుపేట, రామలింగేశ్వరపేట సహా మరికొన్ని డిపోలను పరిశీలించారు. స్టాక్ వివరాలు చెక్ చేసి, డీలర్లతో మాట్లాడారు. సకాలంలో రేషన్ ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని హెచ్చరించారు. రేషన్ సమస్యలు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు.