News July 7, 2025
JGTL: ‘ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి’

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరం పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం పలువురి నుంచి ఆమె దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 39 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 7, 2025
‘నీకు మతి ఉండే నా తలరాత రాశావా?’ అని దేవుడికి లేఖ రాసి..

TG: వేములవాడకు చెందిన దీటి రోహిత్(23) ఆత్మహత్యకు ముందు దేవుడి(శివుడు)కి రాసిన లేఖ కదిలిస్తోంది. ‘నీకు మతి ఉండే నా తలరాత రాశావా? నీ కొడుకు తలరాత అలా రాయలేదే! మేం కొడుకులం కాదా?’ అని ప్రశ్నించాడు. ‘బెస్ట్ సూసైడ్ లెటర్ రాయాలన్న నా కోరిక ఇప్పుడు నెరవేరింది. మరో జన్మ వద్దు’ అంటూ రాసుకొచ్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల డాక్టర్ అవ్వాలన్న తన కోరిక తీరకపోవడంతోనే రోహిత్ బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.
News July 7, 2025
ఇండియన్ ముస్లింలు బందీలు.. సిటిజన్లు కాదు: ఒవైసీ

మైనార్టీలకే ఎక్కువ బెనిఫిట్స్, రక్షణలు ఉన్న ఏకైక దేశం ఇండియానే అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. అవి తమ హక్కులని, చారిటీ కాదని ట్వీట్ చేశారు. ‘మీరు మంత్రి.. చక్రవర్తి కాదు. పాకిస్థానీ, బంగ్లాదేశీ, జీహాదీ, రోహింగ్యా అని పిలిపించుకోవడం బెనిఫిట్ అంటారా? ఇండియన్ మైనారిటీలు కనీసం సెకండ్ క్లాస్ సిటిజన్స్ కూడా కాదు. మేము బందీలం’ అని వ్యాఖ్యానించారు.
News July 7, 2025
NGKL: విద్యుత్ శాఖ ఇన్‌ఛార్జ్ SEగా నరసింహారెడ్డి

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యుత్ ఇన్‌ఛార్జ్ SEగా నరసింహారెడ్డిని నియమిస్తూ సీఎండీ ముష్రఫ్ ఫారుకి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు అదనంగా ఎస్‌ఈ బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, జడ్చర్ల ప్రాంతాలలో ఆయన ఏడీఈ, డీఈగా నిర్వహించారు. మరోసారి జిల్లాకు రావడం పట్ల విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.