News July 5, 2025

JGTL: ఫ్రెండ్స్ అవమానించారని విద్యార్థిని సూసైడ్

image

జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాటిపెల్లి నిత్య(21) HYD KPHB కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ B.TECH థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో చదువులో వెనుకబడ్డావంటూ ఇద్దరు స్నేహితులు నిత్యను అవమానించారు. రెండ్రోజుల క్రితం ఇంటికి వెళ్లిన నిత్య గడ్డి మందు తాగింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. కేసు నమోదైంది.

Similar News

News July 5, 2025

వనపర్తి: ఎన్నికల ప్రక్రియలో బీఎల్ఓల పాత్ర కీలకం: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) పాత్ర ఎంతో కీలకమని, బీఎల్ఓలందరూ ఫామ్ 6, 7, 8లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓలకు జులై 3వ తేదీ నుంచి జులై 10వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో బీఎల్ఓలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు.

News July 5, 2025

రామాయణ ట్రైన్ టూర్.. ఒక్కరికి రూ.1.17 లక్షలు!

image

రామ భక్తుల కోసం IRCTC స్పెషల్ రామాయణ ట్రైన్ టూర్‌ను నిర్వహిస్తోంది. రామునితో అనుబంధమున్న 30 ప్రదేశాలకు భక్తులను తీసుకెళ్తారు. 17 రోజులపాటు సాగే ఈ యాత్ర ఈనెల 25న ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రామాయణ యాత్రలో అయోధ్య, నందిగ్రాం, సీతామర్హి, జనక్‌పుర్, బక్సర్, వారణాసి, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. AC క్లాసులను బట్టి ఒక్కో పర్సన్‌కు ₹1.17L-₹1.79L ఛార్జ్ చేస్తారు.

News July 5, 2025

పాలకొల్లు: మూడు రోజుల వ్యవధిలో తల్లి కూతురు మృతి

image

పాలకొల్లులో ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చి తీవ్ర రక్తస్రావంతో సంగినీడి జయశ్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహారించారని ఆరోపిస్తూ ఆరోజు బంధువులు ఆందోళన చేపట్టారు. శిశువుకు వైద్యం కోసం భీమవరం తరలించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం వైద్యులు ఇంటికి పంపించేశారు. శనివారం ఉదయం శిశువు మృతి చెందింది. తల్లి, కూతురు మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.