News September 21, 2025
JGTL: బయాలజీ ఉపాధ్యాయుడికి OU డాక్టరేట్

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం ZPHSలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లేశ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈయన ‘మార్పో అనాటమికల్ & ఫైటో కెమికల్ స్టడీస్ ఆన్ లెస్సెర్ నోన్ ఇతనో మెడిసినల్ ప్లాంట్స్ ఫ్రమ్ రామగిరి ఖిల్లా ఆఫ్ PDPL డిస్ట్రిక్ట్’ మీద అధ్యయనం చేశారు. ఇందుకు మల్లేశ్‌కు PhD పట్టా లభించింది. పాఠశాల HM చంద్రకళ, పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను సన్మానించారు.
Similar News
News September 21, 2025
రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షం

AP: రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, అనకాపల్లి, పల్నాడు (వినుకొండ) జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, అల్లూరి, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
News September 21, 2025
స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు గోల్డ్

చైనాలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తమిళనాడుకు చెందిన ఆనంద్ కుమార్ వెల్‌కుమార్ అదరగొట్టారు. 42 కి.మీ మారథాన్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. అంతకుముందు ఇదే టోర్నీలో 1000 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 500m విభాగంలో బ్రాంజ్ గెలిచారు. కాగా 2021లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆనంద్ స్వర్ణ పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వరల్డ్ గేమ్స్‌లో కాంస్యం గెలిచారు.
News September 21, 2025
డియర్ లాలెట్టన్.. ఇది మీకు తగిన గుర్తింపు: చిరంజీవి

మలయాళ హీరో మోహన్‌లాల్‌కు కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు విషెస్ తెలిపారు. ‘మై డియర్ లాలెట్టన్.. మీరు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం, ఐకానిక్ పెర్ఫార్మెన్స్, భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీకు తగిన గుర్తింపు’ అని Xలో పేర్కొంటూ మోహన్‌లాల్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు.