News November 6, 2025
JGTL: మందార పువ్వుపై పున్నమి నిండు చంద్రుడు

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మందార పుష్పంపై పున్నమి నిండు చంద్రుడు దీపం ఆకారంలో ప్రకాశిస్తున్నట్లుగా దర్శనమిచ్చాడు. అయితే కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఆలయాల్లో ఆకాశదీపాలను వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో ధర్మపురి క్షేత్రంలో మందారం పువ్వుపై చంద్రుడు కిరణాలు ప్రకాశిస్తూ ఆకాశదీపాన్ని తలపించింది. SHARE IT.
Similar News
News November 6, 2025
RGM: రోజుకు 2.75లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తేనే టార్గెట్ రీచ్

సింగరేణి వ్యాప్తంగా(2025- 26) ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌ను నిర్దేశించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈసారి భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో 11 డివిజన్లలో గడిచిన 7 నెలల్లో 32.64 MTల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించింది. ఇకపై టార్గెట్ రీచ్ కావాలంటే రోజుకు 2.75లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.
News November 6, 2025
మెదక్: అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవినీతి జాడ్యాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రతి రోజు అవినీతి డబ్బుతో ఏసీబీకి దొరకడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి అధికారులు, సిబ్బంది బాధ్యత అన్నారు.
News November 6, 2025
కడప: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కడప జిల్లా కొండాపురం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన బోరు నారాయణరెడ్డి గ్రామం వద్ద బైకుపై రోడ్డు దాటుతుండగా కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.


