News January 20, 2026

JGTL: మున్సిపల్ ఎన్నికల్లో కనిపించని కవిత ఊసు..!

image

NZB మాజీ ఎంపీ కవిత గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగింది. ఒక మహిళ ఎంపీ అయి ఉండి మారుమూల మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో సైతం పల్లెనిద్ర చేశారు. అప్పట్లో NZB పార్లమెంటు పరిధిలో అన్ని తన కనుసన్నల్లో నడిపించింది. కానీ, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత ఊసే లేకుండా పోయింది. దీంతో జగిత్యాల జిల్లాలో కవిత ముఖ్య అనుచరులుగా, అభిమానులుగా ఉన్న నాయకులు మున్సిపల్ ఎన్నికల వేళ నిరాశలో ఉన్నారు.

Similar News

News February 17, 2026

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<19164014>>మరోసారి<<>> తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయం నుంచి రూ.2240 తగ్గి రూ.1,54,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.2,050 పతనమై రూ.1,41,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 17, 2026

చిన్న వయసులో పెద్ద రికార్డు.. కలెక్టర్ ప్రశంసల జల్లు!

image

కేవలం 44 సెకన్లలో 7 సంప్రదాయ శ్లోకాలను పఠించి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో చోటు సంపాదించిన ముమ్మిడివరపు ఆరాశ్రీ దత్తాను కలెక్టర్ మహేశ్ కుమార్ మంగళవారం అభినందించారు. కామనగరువు పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఈ చిన్నారి ప్రతిభను చూసి కలెక్టర్, జేసీ నిశాంతి, ఆర్డీవో మాధవి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆరాశ్రీ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

News February 17, 2026

విజయ్-రష్మిక పెళ్లి: నో ఫోన్.. నో గిఫ్ట్స్.. ఆశీర్వాదం చాలు!

image

విజయ్-రష్మిక Feb 26న ఉదయ్‌పూర్‌(RJ)లో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేడుక అత్యంత ప్రైవేట్‌గా జరగనున్నట్లు, సెలబ్రిటీలెవరినీ ఆహ్వానించలేదని సమాచారం. ఫొటోలు లీక్ కాకుండా ‘నో ఫోన్ పాలసీ’ అమలు చేస్తున్నారని ‘ఇండియా టుడే’ పేర్కొంది. గిఫ్ట్స్ వద్దని, కేవలం ఆశీస్సులు చాలని కోరుతూ సన్నిహితులకు ఇన్విటేషన్ పంపారట. పెళ్లి తర్వాత నెల రోజులు షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.