News January 20, 2026
JGTL: మున్సిపల్ ఎన్నికల్లో కనిపించని కవిత ఊసు..!

NZB మాజీ ఎంపీ కవిత గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగింది. ఒక మహిళ ఎంపీ అయి ఉండి మారుమూల మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో సైతం పల్లెనిద్ర చేశారు. అప్పట్లో NZB పార్లమెంటు పరిధిలో అన్ని తన కనుసన్నల్లో నడిపించింది. కానీ, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత ఊసే లేకుండా పోయింది. దీంతో జగిత్యాల జిల్లాలో కవిత ముఖ్య అనుచరులుగా, అభిమానులుగా ఉన్న నాయకులు మున్సిపల్ ఎన్నికల వేళ నిరాశలో ఉన్నారు.
Similar News
News February 2, 2026
కర్నూలు: ‘30 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

వెల్దుర్తి మండలం కలగొట్ల జడ్పీహెచ్ పాఠశాలలో 1995-96లో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కల్లూరు ఎంఈవో శ్రీనివాసులు, విశ్రాంత ఉపాధ్యాయులు మునీశ్వరరావు, మహేశ్వర్ రెడ్డి పాల్గొని సూచనలు చేశారు.
News February 2, 2026
ఖమ్మం కమిషనరేట్‌లో పోలీస్ యాక్ట్ అమలు

ఖమ్మం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ఈనెల 28వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని పేర్కొన్నారు.
News February 2, 2026
భద్రాద్రి జిల్లాలో 9 నామినేషన్ల ఉపసంహరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆదివారం మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 9 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. అశ్వారావుపేటలో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోగా.. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఇల్లందులో మాత్రం ఎలాంటి ఉపసంహరణలు జరగలేదని అధికారులు వెల్లడించారు.


