News January 19, 2026
JGTL: మున్సిపల్ పోరు.. జీవన్ వర్సెస్ సంజయ్!

JGTLలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య వార్ పీక్ స్టేజికి చేరింది. దీంతో తమకు బీఫామ్ ఇచ్చే నేత ఎవరో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోవడంతో ఏ డివిజన్ టికెట్ ఎవరు ఫైనల్ చేస్తారో తెలియక స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. JGTL మున్సిపల్‌లో 50 డివిజన్స్ ఉండగా.. 94,800 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News March 6, 2026
సివిల్స్ ఫలితాలు విడుదల

సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించారు. ఆ తర్వాతి ర్యాంకుల్లో వరుసగా రాజేశ్వరి సువే, ఆకాన్ష్, రాఘవ్, ఇషాన్ భట్నాగర్ ఉన్నారు. మొత్తంగా 1,087 పోస్టులకు పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈసారి IASకు 180, IFSకు 55, IPSకు 150, గ్రూప్-A సెంట్రల్ సర్వీసెస్‌కు 507, గ్రూప్-B సర్వీసెస్‌కు 195 మంది ఎంపికయ్యారు.
News March 6, 2026
బిహార్ సీఎం నితీశ్ ఆస్తి రూ.1.66 కోట్లు

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు నిన్నటితో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. అభ్యర్థుల అఫిడవిట్ల ప్రకారం బిహార్ CM నితీశ్ కుమార్ అత్యల్ప ఆస్తులు కలిగి ఉన్నారు. తనకు స్థిర, చరాస్తులు ₹1.66Cr, FY25లో వార్షిక ఆదాయం ₹7.87L, చేతిలో కేవలం ₹20,552 నగదు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యధిక ఆస్తులు కలిగిన నేతగా RJD అభ్యర్థి అమరేంద్ర నిలిచారు. తనకు ₹243Cr ఆస్తులు ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు.
News March 6, 2026
NLG: ఐటీఐ అభ్యర్థులకు ‘అప్రెంటిస్‌షిప్ మేళా’

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 9న ‘ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా’ నిర్వహించనున్నారు. స్థానిక అనుముల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ అండాలు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముందుగా www.apprenticeship.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.


