News March 17, 2025

JGTL: రాజీవ్ యువ వికాసం.. యువతలో ఆశలు..!

image

‘రాజీవ్ యువ వికాసం’తో ఉమ్మడి KNR జిల్లాలోని యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పథకం ద్వారా SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనున్నారు. ఈనెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన వారికి రూ.3 లక్షలలోపు విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://tgobmms.cgg.gov.in సైట్‌ను వీక్షించవచ్చు. SHARE IT.

Similar News

News March 17, 2025

కోటబొమ్మాళి : టెన్త్ పరీక్షలకు భయపడి విద్యార్థి పరార్

image

కోటబొమ్మాలి మండలంలోని జగనన్న కాలనీలో నివాసముంటున్న విద్యార్థి 10వ తరగతి పరీక్షలకు భయపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పరీక్షలకు చదవమని ఇంట్లో మందలించారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి అతను కనిపించలేదు. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కోటబొమ్మాళి పీఎస్‌లో పేరెంట్స్ ఫిర్యాదు చేశామన్నారు. 

News March 17, 2025

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన JIO

image

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్- 2025 ప్రారంభం కానున్న వేళ క్రికెట్ అభిమానులకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. ₹299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో ఎంపిక చేసిన వాటిని రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు ఉచితంగా జియో-హాట్‌స్టార్ మొబైల్/TV 4K సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని తెలిపింది. అయితే, ఈరోజు నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. రీఛార్జ్ చేసుకునే సమయంలో ప్యాక్ వివరాలను చెక్ చేసుకోండి.

News March 17, 2025

వయసు పెరిగినా స్ట్రాంగ్‌గానే ఉంటా: విజయశాంతి

image

వయసు పెరిగినా తాను స్ట్రాంగ్‌గానే ఉంటానని నటి విజయశాంతి అన్నారు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ టీజర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. తన విషయంలో కళ్యాణ్ రామ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఈ సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ దొరుకుతుందన్నారు. తానే స్వయంగా ఫైట్ సీన్స్ చేసినట్లు పేర్కొన్నారు. అవి చూసి సెట్లో వారంతా షాక్ అయ్యారని తెలిపారు.

error: Content is protected !!