News December 21, 2025
JGTL: రేపు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు

ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలను మూడు విడతల్లో పూర్తి చేశారు. అయితే, నూతనంగా ఎన్నికైన నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఈ మేరకు జిల్లాలో 385 గ్రామపంచాయతీలు,3536 వార్డు స్థానాలు ఉండగా, ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులు, వార్డ్ మెంబర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రేపు జరిగే ఈ వేడుకలకు పంచాయతీలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు.
Similar News
News December 21, 2025
ఏర్పేడు: రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో రీసెర్చ్ అసోసియేట్ (RA) పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. Ph.D ఇన్ కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/jobs/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 25.
News December 21, 2025
MHBD: వీడని ఉత్కంఠ.. సర్పంచ్ ఎవరు..?

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని <<18536941>>దామరవంచ గ్రామ పంచాయతీలో<<>> విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులుగా సుజాత, స్వాతి పోటీపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో తొలుత స్వాతి 3 ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేయగా, రీకౌంటింగ్‌లో సుజాత ఒక్క ఓటుతో గెలిచినట్లు మరో ప్రకటన చేశారు. దీంతో సర్పంచ్ నేనంటే నేనని సోమవారం ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి సోషల్ మీడియాలో ఆహ్వానం పలుకుతున్నారు.
News December 21, 2025
అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందనే భయంతో..: సీఎం

TG: కేసీఆర్ తన కొడుకు కోసమే బయటికి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ చస్తే హరీశ్ రావు పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. అల్లుడి చేతుల్లోకి పార్టీ పోతుందనే భయంతోనే కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికపరంగా అత్యాచారం చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది. అన్ని ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రావడం లేదు’ అని చిట్‌చాట్‌లో విమర్శించారు.


