News September 9, 2025
JGTL: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జక్క ఆనంద్(25) అనే యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బుగ్గారం మండలం శెకల్ల గ్రామానికి చెందిన ఆనంద్ ఆదివారం రాత్రి మండంలోని బతికపల్లి గ్రామానికి వస్తుండగా, లింగాపూర్ ఎల్లమ్మ గుడి మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు.
Similar News
News September 10, 2025
2027 నాటికి ప్రాజెక్టులు పూర్తి: మంత్రి ఉత్తమ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని SLBC, బ్రహ్మణవెల్లంల, డిండి, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నీటి పారుదల అధికారులతో జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. చివరి దశలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని మండలి ఛైర్మన్ గుత్తా కోరారు. జిల్లాకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
News September 10, 2025
అన్నమయ్య: ఒక్కకాల్.. దళారుల పని ఫట్

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం వెల్లడించారు. మార్కెట్‌లో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు విక్రయిస్తే, వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని రైతులకు సూచించారు. సంప్రదించాల్సిన నంబర్లు 9573990331, 9030315951. ఈ నంబర్లకు కాల్ చేస్తే దళారుల పనిపడతామని కలెక్టర్ అన్నారు.
News September 10, 2025
రైతులు అధైర్య పడకండి.. యూరియా కొరత లేదు: కలెక్టర్

అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా యూరియాను సక్రమంగా అందిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో వివిధ రైతు సేవా కేంద్రాల్లో 298 మెట్రిక్ టన్నులు, సొసైటీలలో 92, ప్రైవేట్ డీలర్ల వద్ద 448 మెట్రిక్ టన్నులు, హోల్‌సేల్ డీలర్లు & AP Markfed వద్ద 1069 మెట్రిక్ టన్నులు, రవాణా కింది 519 మెట్రిక్ టన్నులు మొత్తంగా జిల్లాలో 2,426 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.