News July 8, 2025
JGTL: వృద్ధురాలి అత్యాచారం కేసు.. నేరస్థుడికి 10 ఏళ్ల జైలు

రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలిని అత్యాచారం చేసిన కేసులో నిందితుడు పుట్ట గంగరాజం (60)కు 10 ఏళ్ల జైలు శిక్షను జడ్జి నారాయణ సోమవారం విధించారు. పోలీస్ అధికారులు ఆధారాలు సమర్పించగా, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టి విచారించారు. ఈ సందర్భంగా సమాజంలో నేరం చేసిన వారెవరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని SP అన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులను ఆయన అభినందించారు.
Similar News
News July 8, 2025
ఫోర్త్ సిటీ: దేశంలో అతిపెద్ద స్టేడియం!

TG: CM రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీలో భాగ్యనగర ఇబ్బందులు లేకుండా నిపుణులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత MGBS-చాంద్రాయణగుట్ట మెట్రో రూట్‌ను అక్కడి నుంచి ఫోర్త్ సిటీకి విస్తరించే పనులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఇక కొత్త నగరంలో స్పోర్ట్స్ హబ్ ఉంటుందని CM ఇప్పటికే ప్రకటించగా, ఇందులో భాగంగా దేశంలో అతిపెద్ద స్టేడియాన్ని ఇక్కడ నిర్మిస్తారని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.
News July 8, 2025
గోదావరిఖని: రేపు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె

రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగనుంది. కేంద్రం ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు విధానాలను అవలంబిస్తుందని వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే RGM పారిశ్రామిక ప్రాంతంలోని భారీ పరిశ్రమలైన SCCL, NTPC, RFCLలకు కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఇదిలా ఉంటే, సమ్మె వల్ల జరిగే నష్టాన్ని కార్మిక వర్గానికి వివరిస్తూ సమ్మెకు దూరంగా ఉండాలని యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
News July 8, 2025
కంచరపాలెం: ఈనెల 11న జాబ్ మేళా

కంచరపాలెం ITI జంక్షన్ వద్ద జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి అరుణ మంగళవారం తెలిపారు. 8 కంపెనీలు పాల్గొంటున్న మేళాలో టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 18-45 ఏళ్లలోపు ఆసక్తి గల అభ్యర్థులు https://employement.ap.gov.in వెబ్ సైట్‌లో పేర్లు నమోదు చేసుకొని ధ్రువపత్రాలతో ఆరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.