News March 17, 2025
JGTL: హాట్ టాపిక్‌గా KTR, తీన్మార్ మల్లన్న భేటీ..!

KTR, హరీశ్ రావు, తీన్మార్ మల్లన్న HYDలో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పుల్లా ఉండే వీరి భేటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బీఆర్ఎస్ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన వీరి అనూహ్య భేటీపై మీ కామెంట్.
Similar News
News March 17, 2025
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదల కానున్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి జూన్ నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని TTD వెల్లడించింది. ఈ టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18, 19, 20వ తేదీల్లో ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించింది. అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని సూచించింది.
News March 17, 2025
‘ట్రూత్ సోషల్’లో ప్రధాని మోదీ.. తొలి పోస్ట్ ఇదే

ట్రంప్ మీడియా&టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో భారత ప్రధాని మోదీ జాయిన్ అయ్యారు. ఈ వేదికపై అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. లెక్స్ ఫ్రైడ్‌మన్‌కు ఇచ్చిన తన ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేసినందుకు US ప్రెసిడెంట్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ తన ప్రకటనలు ఎక్కువగా ‘ట్రూత్ సోషల్’లోనే చేస్తారన్న సంగతి తెలిసిందే.
News March 17, 2025
ఇంటికే భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలు: TGSRTC

TG: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేర్చనున్నట్లు TGSRTC తెలిపింది. తలంబ్రాలు కావాల్సిన భక్తులు TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాలు, సంస్థ వెబ్‌సైట్‌లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. సీతారాముల కళ్యాణం అయ్యాక తలంబ్రాలను హోం డెలివరీ చేస్తామని తెలిపింది. వివరాలకు 040-69440069, 040-69440000 నంబర్లలో సంప్రదించండి.