News September 22, 2025
JGTL: 1,700 కిలోల పూలు.. 16 అడుగుల ఎత్తు..!

రాష్ట్రంలో నిమజ్జనం చేసే అతిపెద్ద బతుకమ్మ జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే బతుకమ్మ. 2016లో 10.5 అడుగుల వెడల్పు, 16 అడుగుల ఎత్తుతో 1,700 KGల పూలతో తయారుచేసిన బతుకమ్మ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఇక అప్పట్నుంచి ఏటా మహా బతుకమ్మ పేరుతో అదే రీతిలో బతుకమ్మను పేరుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News September 22, 2025
VJA: ‘దసరా సెలవుల్లో స్కూల్ నిర్వహిస్తే కఠిన చర్యలు’

ప్రభుత్వం నేటి నుంచి దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో, పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్, పేరెంట్స్ మీటింగ్‌లు నిర్వహించరాదని DEO సుబ్బారావు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం DEO ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News September 22, 2025
ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరిన వెండి ధర

వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ KG వెండిపై రూ.3000 పెరిగి రూ.1,48,000తో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. 4 రోజుల్లోనే వెండి ధర రూ.7వేలు పెరగడం గమనార్హం. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.430 పెరిగి రూ.1,12,580కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.400 ఎగబాకి రూ.1,03,200 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 22, 2025
ప్రకాశం: ఇంటర్ కాలేజీలకు RIO వార్నింగ్

ప్రకాశం జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని RIO ఆంజనేయులు అన్నారు. కలెక్టరేట్ వద్ద సర్టిఫికెట్ల కోసం నిరసన తెలిపిన విద్యార్థినికి సంబంధిత కళాశాల యాజమాన్యంతో మాట్లాడి సర్టిఫికెట్లు అందించారని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఏ కళాశాల పాల్పడినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.