News July 8, 2025

JGTL: ‘90% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి’

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. GOVT. ఆసుపత్రులలో డెలివరీలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3నెలల్లో ప్రభుత్వాసుపత్రులలో డెలివరీల సంఖ్య తక్కువగా ఉందని, సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. వచ్చే 3నెలల్లో 90% డెలివరీలు ప్రభుత్వాసుపత్రిల్లోనే జరిగేటట్లు చూడాలన్నారు. DMHO పాల్గొన్నారు.

Similar News

News July 8, 2025

బోధన్: పథకాల అమలుపై కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన బోధన్ మున్సిపాలిటీలో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుదారులకు అనుమతుల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News July 8, 2025

శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు

image

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారిని సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద సీఎంకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈవో శ్రీనివాసరావు, అర్చక స్వాములు సాంప్రదాయ ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, జ్ఞాపికతో ముఖ్యమంత్రిని సత్కరించారు.

News July 8, 2025

ఇంద్రకీలాద్రి కదంభ ప్రసాదం ప్రత్యేకత ఏంటో తెలుసా?

image

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ జులై 8, 9, 10 తేదీల్లో శాకంబరి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని కూరగాయలు, పండ్లతో అలంకరిస్తారు. ప్రత్యేకంగా తయారుచేసే కదంభ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. పప్పు, బియ్యం, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో చేసే ఈ ప్రసాదంలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈవో శీనా నాయక్ ప్రసాద పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.