News September 9, 2025
JGTL: FLIPKARTలో జాబ్స్.. రూ.25,000ల జీతం!

JGTL జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రేపు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ తెలిపారు. FLIPKARTలో డెలివరీ బాయ్స్‌గా 20 ఖాళీలు ఉన్నాయని, SSC చదివి 18 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ.20,000- రూ.25,000 వేతనం ఉంటుందన్నారు. వివరాలకు 7799284842 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News September 9, 2025
సిద్దిపేట: 1st వందల్లో ఇచ్చి లక్షల్లో లాగేస్తారు: సీపీ

పార్ట్ టైం జాబ్ మోసాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని CP అనురాధ పేర్కొన్నారు. ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించవచ్చని వచ్చే కాల్స్‌ను నమ్మొద్దన్నారు. మొదట్లో వందల్లో ఇచ్చి ఆపై లక్షల్లో లాగేస్తారని, ఆన్లైన్ టాస్క్‌ల పేరిట ముంచేస్తారని ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ ను నమ్మొద్దని సూచించారు. అప్రమత్తతే మిమ్మల్ని రక్షిస్తుందని, ఎవరికి రిఫర్ చేయొద్దని సీపీ సూచించారు.
News September 9, 2025
గ్రూప్-1 వ్యవహారంపై నేడే తీర్పు

TG: గ్రూప్-1 వ్యవహారంపై హైకోర్టు ఇవాళ ఏం తీర్పు ఇవ్వనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేయగా, పరీక్షలను రద్దు చేయొద్దని ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు చెప్పనుంది. గ్రూప్-1 అంశం కోర్టులో ఉండటంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది.
News September 9, 2025
ఇవాళ భారీ వర్షాలు

ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న వైజాగ్, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అటు కోస్తా జిల్లాలు NTR, బాపట్ల, ప్రకాశం, నెల్లూరులో ఎండలు దంచికొడుతున్నాయి. 38.8డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.