News October 4, 2024

స్విగ్గీకి హోటళ్లు, రెస్టారెంట్ల ఝలక్

image

AP: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. స్విగ్గీ, జొమాటో వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొంది. తమ అభ్యంతరాలకు జొమాటో ఒప్పుకోగా, స్విగ్గీ అంగీకరించలేదని తెలిపింది. నగదు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నందుకే స్విగ్గీని బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది.

Similar News

News November 23, 2025

జగిత్యాలలో ప్రశాంతంగా ఎస్‌ఎంఎంఎస్ పరీక్షలు

image

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆదివారం మొత్తం ఆరు పరీక్షా కేంద్రాల్లో ఎస్‌ఎంఎంఎస్ (SMMS) పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు అర్హులైన 1,474 మంది విద్యార్థుల్లో 1,416 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా, ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 23, 2025

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో దుమ్మురేపిన లక్ష్యసేన్

image

భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025లో అద్భుత విజయం సాధించారు. జపాన్‌ ఆటగాడు యూషీ తనాకాపై 21-15, 21-11 తేడాతో జయకేతనం ఎగరవేశారు. దీంతో సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన మూడో భారత ఆటగాడిగా లక్ష్య నిలిచారు. ఈ సీజన్‌లో అతనికి ఇదే తొలి BWF టైటిల్. అలాగే తన కెరీర్‌లో మూడో సూపర్‌ 500 టైటిల్‌.

News November 23, 2025

స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం

image

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరుకావాలన్న స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు నేటితో గడువు ముగియనుండటంతో మరి కొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు, తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేతలను ఆయన కలిసి చర్చించినట్లు సమాచారం.