News July 21, 2024
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జాన్వీ
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాన్వీ కపూర్ డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తండ్రి బోనీ కపూర్ చెప్పారు. ఫుడ్ పాయిజన్ వల్ల జాన్వీని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఆరోగ్యం మెరుగవ్వడంతో ఇవాళ ఉదయం ఇంటికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
Similar News
News January 24, 2025
గ్రామాలకు మహర్దశ.. రోడ్ల నిర్మాణానికి రూ.2,773 కోట్లు మంజూరు
TG: ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలన్న CM రేవంత్ రెడ్డి <<15058155>>ఆదేశాల<<>> నేపథ్యంలో ప్రభుత్వం రూ.2,773కోట్లు మంజూరు చేసింది. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.1,419కోట్లు, మరమ్మతులకు రూ.1,288కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం అమలు చేసే ‘పీఎం జన్‌మన్’ పథకానికి రాష్ట్ర వాటాగా రూ.66కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ రోడ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.2,682కోట్లు విడుదల చేసింది.
News January 24, 2025
దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
TG: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో గురువారం అర్ధరాత్రి ఐటీ సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్షితరెడ్డి, బంధువుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో ఆయన తల్లి అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
News January 24, 2025
అకౌంట్లోకి డబ్బులు.. BIG UPDATE
TG: రైతుభరోసా డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. మొత్తం 1.49 కోట్ల ఎకరాలు సాగుకు యోగ్యమైనవిగా ప్రాథమికంగా గుర్తించింది. ఎకరాకు రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 3 లక్షల ఎకరాలకు పైగా భూములు సాగుకు యోగ్యం కావని తేల్చి, వాటి సర్వే నంబర్లను బ్లాక్ చేసింది. మొత్తంగా రైతు భరోసా కింద రూ.8900 కోట్లు అవసరం అవుతాయని అధికారుల అంచనా.