News July 15, 2024

ప్రధాని మోదీతో ఝార్ఖండ్ సీఎం భేటీ

image

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల సోరెన్ తిరిగి ఝార్ఖండ్ సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత సోనియాను కలిశారు. కాగా భూకుంభకోణం కేసులో అరెస్టైన హేమంత్ కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు.

Similar News

News November 17, 2025

భారతీయ ఉద్యోగికి UAE అత్యుత్తమ బహుమతి!

image

UAE ఇచ్చే ‘అత్యుత్తమ ఉద్యోగి’ బహుమతిని ఇండియన్ గెలుచుకున్నారు. బుర్జీల్ హోల్డింగ్స్‌లో HR మేనేజర్‌గా అనాస్ కడియారకం(KL) పని చేస్తున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్‌లో అత్యుత్తమ వర్క్‌ఫోర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆయనకు ట్రోఫీ, ₹24L, బంగారు నాణెం, యాపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డు అందజేశారు. గతంలో కరోనా టైమ్‌లో సేవలకు హీరోస్ ఆఫ్ ది UAE మెడల్, గోల్డెన్ వీసాను అనాస్ అందుకున్నారు.

News November 17, 2025

3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

ఐబీపీఎస్ <>RRB<<>> పీవో ప్రిలిమ్స్ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచింది. RRB పీవో పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు www.ibps.in/ సైట్లో రిజిస్ట్రేషన్, రోల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3,928 పోస్టులకు ఈ నెల 22,23 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

News November 17, 2025

ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (<>NIELIT<<>>) 4 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ, BE, B.Tech, M.Tech, MSc, CA, CMA/B.Com, M.Com ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23వరకు అప్లై చేసుకోవచ్చు . దరఖాస్తు ఫీజు రూ.200. ఈ నెల 26న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.nielit.gov.in/