News October 22, 2024

ఝార్ఖండ్ ఎలక్షన్స్: BJPలో అసంతృప్తి సెగలు

image

ఝార్ఖండ్ BJPలో అసంతృప్తి జ్వాలలు లేచాయి. ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లకు ఎక్కువ టికెట్లు ఇచ్చారని ముగ్గురు మాజీ MLAలు సహా కొందరు నేతలు అధికార JMMలో చేరారు. 66 మందితో BJP తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో మాజీ CM చంపై సోరెన్, బాబులాల్ సోరెన్ సహా సగానికి పైగా వలస నేతలే ఉన్నారు. అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు పెద్ద పార్టీలకు ఇలాంటివి సహజమేనని పోల్స్ కో ఇన్‌ఛార్జ్ హిమంత బిశ్వశర్మ అన్నారు.

Similar News

News October 22, 2024

అదనపు కలెక్టర్‌కు రూ.5కోట్ల అక్రమ ఆస్తులు.. కేసు నమోదు

image

TG: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా, రూ.5కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఆయన రూ.8లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.

News October 22, 2024

సెబీ చీఫ్‌కు పార్లమెంటు PAC క్లీన్‌చిట్!

image

ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లపై ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సెబీ చీఫ్ మాధబీ పురీకి పార్ల‌మెంటు PAC క్లీన్‌చిట్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అదానీ షెల్ కంపెనీల్లో మాధ‌బీకి వాటాలున్నాయని, ఆమె ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారంటూ హిండెన్‌బ‌ర్గ్‌, కాంగ్రెస్ ఆరోపించాయి. దీనిపై విచార‌ణ జ‌రిపిన PAC మాధ‌బీ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని తేల్చినట్టు సమాచారం. దీంతో ఆమె Feb, 2025 వ‌ర‌కు సెబీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా కొన‌సాగే అవకాశముంది.

News October 22, 2024

లెక్కలేనన్ని దుర్మార్గాలు చేసిన జగన్: మంత్రి గొట్టిపాటి

image

AP: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. ఏ సీఎం చేయనన్ని దుర్మార్గాలు గత ఐదేళ్లలో జగన్ చేశారని విమర్శించారు. ఆయన చేసిన అరాచకాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందని చెప్పారు. ఇప్పుడు వైసీపీ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ చేసే కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.