News November 23, 2024
ఝార్ఖండ్ ఎన్నికలు.. టార్గెట్ 41
ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా మేజిక్ ఫిగర్ 41. ఇక్కడ NDA, INDIA కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. NDA కూటమిలోని BJP-68, AJSU-10, JDU-2, లోక్ జన్‌శక్తి(రామ్ విలాస్ పాశ్వాన్) ఒక చోట పోటీ చేస్తున్నాయి. INDIA కూటమిలోని JMM-42, INC-30, RJD-6, CPI(ML)-3 చోట్ల బరిలో నిలిచాయి. రాష్ట్రంలో ప్రస్తుతం JMM అధికారంలో ఉండగా ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు NDAకు మొగ్గు చూపాయి.
Similar News
News November 23, 2024
ప్రియాంక మెజార్టీ 2,00,000+
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ బంపర్ విక్టరీ ఖాయమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆమె మెజార్టీ 2 లక్షలు దాటింది. దీంతో కాంగ్రెస్ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా కాంగ్రెస్ కంచుకోటలో పోటీ చేస్తున్న నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
News November 23, 2024
మా సర్వే నిజమవుతుంది: యాక్సిస్ మై ఇండియా MD
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితంపై సర్వే సంస్థలు అంచనా వేసిన నంబర్లు తారుమారవుతున్నాయి. ఇక్కడ మహాయుతి 150, MVA 100+ సీట్లొస్తాయని చెప్పుకొచ్చాయి. కానీ, ఫలితాలు చూస్తుంటే మహా కూటమి 200+సీట్లు గెలిచేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా MD ప్రదీప్ గుప్తా తమ సర్వే రిజల్ట్స్‌ను రీట్వీట్ చేశారు. తమ అంచనా నిజమవుతుందని మరోసారి గుర్తుచేశారు. ప్రస్తుతం MHలో 225స్థానాల్లో ‘మహా’ ముందంజలో ఉంది.
News November 23, 2024
ఆసీస్ చెత్త రికార్డు!
ఇండియాతో సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 2000 నుంచి స్వదేశంలో టెస్టుల్లో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయిన చెత్త రికార్డును ఆసీస్ మూటగట్టుకుంది. తక్కువ స్కోరు చేసిన మ్యాచుల్లో ఇది మూడోవదిగా నిలిచింది. సౌత్ ఆఫ్రికాతో 85, ఇంగ్లాండ్‌తో 98, ఇండియాతో 104, పాకిస్థాన్‌తో 127, న్యూజిలాండ్‌తో 136, ఇంగ్లండ్‌తో 138 రన్స్‌కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.